అభివృద్ధి పనుల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కిరణ్ 24 x 7 న్యూస్:
*కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం దీన్నే దేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పుల్లారెడ్డి కాలేజీ దగ్గర నుండి జగన్నాథ గట్టు వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొడనమైనది*
ఈ సందర్భంగా రోడ్డుపై పూజలు నిర్వహించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల దైనందిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో విద్యార్థులు, భక్తులు, స్థానిక ప్రజలు సులభంగా ప్రయాణించగలరని, వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని అన్నారు.

జగన్నాథ గట్టు ప్రాంతానికి వెళ్లే ఈ రోడ్డు ఎంతో కీలకమైందని, ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవ స్వామి, గ్రామ పెద్ద మోహన్ రెడ్డి, ఇంజనీర్ కరెన్న, ఎంపీడీవో రఘు నాథ , శ్రీ నిలయం రంగ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






