గ్రంధాలయం లో శ్రమదానం.సహకరించిన అఖిల పక్షాలు.

కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు పట్టణంలోనీ పాత బస్ స్టాండ్ లో ఉన్న గ్రంథాలయ సంస్థ లో ఆదివారం గ్రామ పెద్దలు శ్రమదానం చేశారు. కోడుమూరు అభివృధి కమిటీ ఆధ్వర్యంలో ఈ శ్రమదానం నిర్వహించి గ్రంథాలయ ఆవరణను శుబ్రం చేశారు.

ఈ గ్రంథాలయ సంస్థ భవిష్యత్తు లో కూడా ఎలాంటి కబ్జాకు గురి కాకుండా శ్రమదానం తో శుభ్ర పరిచినట్లు కోడుమూరు అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు క్రిష్ణయ్య , అధ్యక్షులు డాక్టర్ షాకిర్, కార్యదర్శి జయన్న లు తెలిపారు. ఈ శ్రమదానం కు సహకరించి శ్రమదానం చేసిన అఖిల పక్ష నాయకులకు, పార్టీ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయ భూమి ప్రభుత్వ స్థలం అని, ఇందుకోసం ఎవరైనా కబ్జాకు ప్రయత్నిస్తే చట్టం ప్రకారం పోవాల్సివస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. గ్రంధాలయం స్థలం కబ్జా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు వారు పేర్కొన్నారు.