కిరణ్ 24 x 7 న్యూస్:
గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాయి తయారీ కేంద్రాలపై గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో పోలీసులు సారాయి కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి సారాయి (అర్రాక్) నీ ధ్వంసం చేశారు. సారాయి కేంద్రాలలో సుమారుగా 300 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకుని నాశనం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా సారాయిని తయారుచేసి విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.