బాధితులకు అండగా నిలిచిన డాక్టర్ ఆదిమూలపు సతీష్
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు నియోజవర్గంలోని గూడూరు మండలం పరిధిలోని వై. ఖానాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బడే సాహెబ్, నడిపి రంగన్న ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం వారిని తక్షణమే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
బాధితుల పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆసుపత్రికి చేరుకుని, ముఖ్యంగా బడే సాహెబ్‌కు తక్షణ ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించడంతో, స్వయంగా దగ్గరుండి వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా సహకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
కర్నూలు మండలం ఆర్‌కే దుద్యాల గ్రామానికి చెందిన మార్తమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని గ్రామ నాయకుల ద్వారా సమాచారం అందింది. ఈ విషయంపై స్పందించిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కర్నూలు ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించి, ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. బాధితురాలికి తగిన చికిత్స అందేలా తనవంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాల్లో ముందుండి స్పందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్న డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని అభినందించారు. ఇలాంటి మానవీయ సేవలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.







