*సి.బెలగల్ మండలం పలుకుదొడ్డి గ్రామంలో రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి *

కిరణ్ 24×7 న్యూస్:

రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారిని మండల టిడిపి నాయకులు మరియు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తుందని రీ సర్వే జరిగిన గ్రామాల్లో పట్టాదారు పుస్తకాలు రైతులకు ఇస్తారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలపై పాలకుల ఫోటోలు ముద్రించి రాజకీయ స్వార్థానికి వినియోగించారని, రైతుల హక్కులను కూడా ప్రచార సాధనంగా మార్చారని కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రైతుల భూమి హక్కులకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పత్రాలపై వ్యక్తుల ఫోటోలు కాకుండా, ప్రభుత్వ అధికారిక ముద్ర ఉండాలనే సదుద్దేశంతో ఈ మార్పు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే గారు స్వయంగా అందజేశారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా, పూర్తి స్థాయి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పాస పుస్తకాలను తీసుకున్న రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ ప్రజలు తమ గ్రామానికి ఎన్నో సంవత్సరాల లేని రోడ్డును ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేశారని గ్రామ ప్రజలు మహిళలు ఎమ్మెల్యే గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.
అలాగే గ్రామంలోని సిసి రోడ్లను కాలువల సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి వివరించగా అది కూడా కచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో గారు,గ్రామ సర్పంచ్ గారు,మండల టిడిపి నాయకులు,గ్రామ పెద్దలు,ప్రభుత్వ అధికారులు,సచివాలయ సిబ్బంది, ప్రజలు, రైతులు,సంబంధిత అధికారులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు