సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపాలని నిరసన కార్యక్రమాలు..
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు జిల్లా సహకార యూనియన్ ఆదేశాల మేరకు మూడు సంఘాల సిబ్బంది ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది..
అందులో భాగంగా జిల్లా యూనియన్ అధ్యక్షులు హరీష్ భాషా, జనరల్ సెక్రెటరీ ఖాజా మొహిద్దిన్, ట్రెజరర్ మహేంద్ర హాజరై ఉద్యోగుల సమస్యల గురించి సహకార సంఘాల అధ్యక్షులకు తెలియజేయడం జరిగినది..
ఇందుకు మూడు సంఘాల అధ్యక్షులు సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపాలని సంఘీభావం తెలపడం అయినది. ఇందులో గూడూరు పిఐసి చైర్మన్ దానమయ్య, బెలగల్ చైర్మన్ బిఎస్ తిమ్మప్ప, పోలకల్ జె ఎఫ్ సి ఎస్ అధ్యక్షులు ధనవంతులు హాజరై తమ మద్దతు తెలియజేశారు.
కార్యక్రమంలో సహకార ఉద్యోగులైన సి బెలగల్ సీఈఓ కాజా హుస్సేన్,గూడూరు సీఈవో శివకుమార్ రెడ్డి,పోలకల్ సీఈవో లక్ష్మన్న ,మధుసూదనారెడ్డి,చంద్ర శేఖర్,వెంకటేష్,శివ,సురేంద్ర,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘం ఉద్యోగుల డిమాండ్స్…
రైతు సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు * జి. ఓ నెం. 36 వెంటనే అమలుపరిచి, 2019 మరియు 2024 పెండింగ్ లో వున్న వేతన సవరణలు చేయాలి,
అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలి * ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి
. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.
* ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి, ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇస్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి.
అనేక సంఘాలలో ఉద్యోగుల జీతభధ్యలను డ్యూటు పద్దు నందు ఉంచడం జరిగింది, ఈ డ్యూటు పద్దులను రద్దు చెయ్యాలి. * 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి.
వారికి కూడా జి.ఓ నెం.36 అమలు పరచాలి. * పి.ఏ.సి.ఎస్ ల ద్వారా కాకుండా, డి.సి.సి.బి ల ద్వారా రైతులకు డైరెక్ట్ గా ఋణాలు ఇస్తున్నారు. దీనివలన పి.ఏ.సి.ఎస్ నిర్వీర్యం అయిపోవీచున్నని. ఈ విధానాన్ని మార్పు చేసి అన్నీ సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. *
సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6% డివిడెంట్ లేదా కనీసం 6% వడ్డీ చెల్లించాలి. దీనిపై చర్యలు తీసుకోవాలి. * సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదలీలు జరగాలంటే డి.ఎల్.ఎస్.ఎఫ్ ను అప్కాబ్, డిసీసీబీలు, PACS లతో ఏర్పాటు చేసి 3 సువర్సరాల నిబందన కాకుండా నిరవదకంగా కొనసాగించి బదిలీలు చేయాలి.
* Capacity to pay నిభందనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలను DLSF ద్వారా నిరవధికంగా చెల్లించాలి. * ప్రస్తుతము పనిచేయుచున్న Assistant Executives Clerks లేదా కంప్యూటర్ ఆపరేటర్ లను సీనియార్టీ ప్రాతిపదికిన జిల్లాలో ఖాళీగా ఉన్న సి.ఇ.ఓ పదవులను వీరితో భర్తీ చేసుకోవాలి. * Assistant Executives DLEC ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి.






