కిరణ్ 24×7 న్యూస్:

శ్రీసుంకులా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు  ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గూడూరు మండలంలోని కె.నాగలాపురం గ్రామం నందు దేవస్థానం తరపున సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల  ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో లక్ష్మీదేవి మొదటి బహుమతి పదివేల రూపాయలు,రెండవ బహుమతి కమ్మరి హేమలత, 5000 రూపాయలు,మూడో బహుమతి బెస్త రాధమ్మ 3000 రూపాయలు గెలుపొందారు.

దేవాదాయ శాఖ అధికారి పి. ఎన్. రాధాకృష్ణ  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు భగవద్గీత పుస్తకాలు బహుకరించారు.

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నయోమి  మండల కన్వీనర్ సురేష్  ఎస్సై అఖిల్ కుమార్  గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి  మరియు యుగేందర్  మందుల సుంకన్న  తిరుపాల్  వసంత కుమార్ , ఆలయ సిబ్బంది కేశవ పాల్గొన్నారు.