శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్లిన శివ భక్తులు సోమవారం నుండి అన్నదాన కార్యక్రమాలు..
కిరణ్ 24 x7 న్యూస్ :
గూడూరు ఎస్ఐ రాజ కుల్లాయప్ప సమక్షంలో శ్రీశైలంలో దాతలు సహకారంతో ఏడు రోజులపాటు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి శివ స్వాములు మరియు నీలకంఠేశ్వర భక్త బృందం సభ్యులు ఆదివారం శ్రీ శ్రీశైల క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా కార్యానిర్వహకులు మాట్లాడుతూ
గూడూరు పట్టణానికి చెందిన శివ స్వాములు భారీ సంఖ్యలో శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారని అన్నారు.

శ్రీశైలం చేరుకున్న వారికి రేపటి సోమవారం నుండి శివరాత్రి రోజు వరకు దాదాపు 7 రోజులు శ్రీశైలంలో బాల గణేష్ పార్క్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుందని, గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గూడూరు నగర పంచాయతీ పట్టణ దాతలకు, గ్రామ పెద్దలకు శివ స్వాముల కుటుంబాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీశైలం వచ్చేవాళ్లు గౌరీ సదన్ గంగా సదన్ ఎదురుగా ఉన్న బాల గణేష్ పార్కు దగ్గరకు రాగలరని నీలకంటేశ్వర భక్తబృందం తెలియజేశారు.