గూడూరు, జూన్ 12,( కిరణ్24×7న్యూస్)
గూడూరు మండల మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలను అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పూల మాలలతో శాలువాలతో సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరిపారు. గత 35 సంవత్సరాలుగా మాజీ జెడ్పిటిసి,॥ ప్రజా నాయకులు ఎల్. వెంకటేశ్వర్లు చైతన్య యూత్ సారధ్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి తన వంతు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ కౌన్సిలర్లు విజయుడు, బజారి, దస్తగిరి, వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ జిలాని నాయకులు ఉగ్ర, ఎల్లా గౌడ్, వెంకటేష్, మరియు కోఆప్షన్ సభ్యులు రామాంజనేయులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.