కోడుమూరులో వైయస్ఆర్సీపీ ఐడి కార్డు వెరిఫికేషన్ సమావేశం
సంస్థాగత బలోపేతానికి ఇది కీలకం: డాక్టర్ ఆదిమూలపు సతీష్
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియపై శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. కర్నూలు ఏ క్యాంప్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంచార్జి డా. ఆదిమూలపు సతీష్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ అబ్జర్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, సోషల్ మీడియా, ఐటీ, యూత్ వింగ్ బాధ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. సతీష్ మాట్లాడుతూ పార్టీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని అన్నారు. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు.

పార్టీ నిర్మాణం బలోపేతానికి ఐడి కార్డు వెరిఫికేషన్ కీలకమని, నిజమైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు వెరిఫికేషన్ విధానంపై చర్చించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మౌలాలి, వైస్ ఎంపీపీ నెహమియా, మాజీ కౌన్సిలర్ విక్రమ్ సింహరెడ్డి,మండల కన్వీనర్లు సోమశేఖర్ రెడ్డి, మోహన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు హనుమంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు డి వాసు, కర్నూల్ సోషల్ మీడియా అధ్యక్షులు మధు శేఖర్, యూత్ వింగ్ నియోజవర్గం విభాగం ఎంకే వెంకటేష్, అధ్యక్షులుసోషల్ మీడియా నియోజవర్గం అధ్యక్షులు గిరిప్రసాద్, ఎస్సీ సెల్ కార్యదర్శి సురేష్, కోడుమూరు నియోజవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బొజ్జన్న, ఎంప్లాయిస్, పింఛను విభాగం అధ్యక్షులు కోడుమూరు నియోజకవర్గం రామకృష్ణ యాదవ్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






