కేడీసీసీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ని సన్మానించిన సింగనగేరి నేతలు..

గూడూరు కిరణ్ 24×7 న్యూస్ :
గూడూరు నగర్ పంచాయితీ పరిధి లోని 7 వ వార్డు సింగనిగేరిలో గత వారం లో బోరు వేయించిన సందర్భముగా కృతజ్ఞతతో వార్డు కౌన్సిలర్ మండ్ల రత్నమ్మ మరియు సింగనగేరి నేతలు. కేడీసీసీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ని వార్డు పెద్దలందరు కలిసి గజమాలతో సత్కరించారు.. ఈ కార్యక్రమం లో భాగంగా బోరు కీ, ట్యాంక్ మరియు మోటార్ వేయడానికి కూడా తక్షణమే సానుకూలంగా స్పందించారు.. ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు, పుట్టపాశం పరుశురాముడు, పుట్టపాశం బాబు, ఎస్సీ.భాస్కర్, పి. కృష్ణుడు, పి. వాసు, పి బాను, పి గజేంద్ర, పి. వెంకటేష్, పి. శివ, పి భూపతి, విగ్నేష్, ఏ. కృష్ణ, తదితరులు.. పాల్గొన్నారు.

కోట్ల హ‌ర్ష‌న్న‌కు గూడూరు మండల వైఎస్ఆర్సిపి నేతలు సన్మానం

కిరణ్ 24×7 న్యూస్:వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) స‌భ్యుడిగా కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి నియ‌మితులు కావ‌డం తో బుధవారం కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గూడూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కి శాలువాలు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి తో పాటు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను గూడూరు మండల నాయకులు శాలువాలు పూలమాలలు వేసి సత్కరించారు. అందరం కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత బ‌లోపేతం చేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని డాక్టర్ ఆదిమూలపు సతీష్ ని కోడుమూరు ఎమ్మెల్యే చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సునితమ్మ, రైతు విభాగం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి నరసింహారెడ్డి, మండల కన్వీనర్ రామాంజనేయులు, మద్దిలేటి రెడ్డి, తిమ్మారెడ్డి, జిల్లా కార్మిక శాఖ కార్యదర్శి దివాకర్ రెడ్డి, మాధవస్వామి, రామచంద్రుడు, మునగాల సర్పంచ్ గోపాలు, దౌలత్ భాష, కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బన్న, బడే సాహెబ్, రాముడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కోట్ల హ‌ర్ష‌న్న‌కు గూడూరు మండల వైఎస్ఆర్సిపి నేతలు సన్మానం

కిరణ్ 24×7 న్యూస్ :వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) స‌భ్యుడిగా కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి నియ‌మితులు కావ‌డం తో బుధవారం కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గూడూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కి శాలువాలు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి తో పాటు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను గూడూరు మండల నాయకులు శాలువాలు పూలమాలలు వేసి సత్కరించారు . ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ నాయకత్వంలో గూడూరు మండల నాయకులు అందరం కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత బ‌లోపేతం చేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని డాక్టర్ ఆదిమూలపు సతీష్ ని కోడుమూరు ఎమ్మెల్యే చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునితమ్మ, రైతు విభాగం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి నరసింహారెడ్డి, మండల కన్వీనర్ రామాంజనేయులు, మద్దిలేటి రెడ్డి, తిమ్మారెడ్డి, జిల్లా కార్మిక శాఖ కార్యదర్శి దివాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ కార్యదర్శి మాధవస్వామి, గూడూరు మండల ట్రెజరీ రామచంద్రుడు, మునగాల సర్పంచ్ గోపాలు, దౌలత్ భాష, కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బన్న, బడే సాహెబ్, రాముడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని సన్మానించిన కోడుమూరు ఇంచార్జ్..

కర్నూలు 24x7news ( కిరణ్)

హ‌ర్ష‌న్న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన కోడుమూరు ఇన్చార్జి కర్నూలు పల్లెవాణి ( కిరణ్)

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) స‌భ్యుడిగా కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి నియ‌మితులు కావ‌డం సంతోషంగా ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ అన్నారు. సోమ‌వారం కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిని ఆదిమూల‌పు స‌తీష్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఎస్ఈసీ స‌భ్యుడిగా ఎంపికైనందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుర్తించి పార్టీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) స‌భ్యుడిగా నియ‌మించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. నా రాజకీయ గురువు హ‌ర్ష‌న్న‌తో క‌లిసి పార్టీని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత బ‌లోపేతం చేసి తిరిగి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుంటామన్నారు.

అంద‌రం ఐక్యంగా ముందుకు సాగుతూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఎగుర‌వేస్తామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజవర్గం సమన్వయకర్త పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి మ‌రిన్ని ప‌ద‌వులు అలంక‌రించి, ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షించారు.

వారి తో పాటు రామకృష్ణారెడ్డి, కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి మైనార్టీ విభాగం అధ్యక్షులు బందే నవాజ్, వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కోడుమూరు మండలం కార్మిక విభాగమ అధ్యక్షులు భాస్కర్, కొత్తూరు రవికుమార్, శ్రీను, మద్దిలేటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.

నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు..కోడుమూరు ఇన్చార్జి.. డాక్టర్ ఆదిమూలపు సతీష్

 

కోడుమూరు( కిరణ్),..అమ్మవారి అనుగ్రహంతో కోడుమూరు నియోజకవర్గం లోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆకాంక్షించారు.

గూడూరు పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.. మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు.

గూడూరు పల్లె వాణి( కిరణ్), అక్టోబర్ 01:-అమ్మవారి అనుగ్రహంతో గూడూరు పట్టణం లోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని గూడూరు మండలం మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు.

విజయదశమి శుభాకాంక్షలు.. కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్.

గూడూరు పల్లె వాణి( కిరణ్), అక్టోబర్ 01:-అమ్మవారి అనుగ్రహంతో గూడూరు పట్టణం లోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు.

వ్యాధుల నివారణకై ప్రజలకు అవగాహన కార్యక్రమం:

గూడూరు పల్లె వాణి:
గూడూరు వైద్య కేంద్రం పరిధిలోని పూలకుర్తి గ్రామం లో స్వస్థనారి శాసక్త్ నరిపరివార్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఇందులో భాగంగా ప్రజలకు బీపీ,షుగర్, క్యాన్సర్ లపై అవగాహన కలిగించి గర్భవతులకు,రక్త పరీక్షలు చేసి సరియైన చికిత్స చేయడం జరిగింది. 60 సంవత్సరాల పైబడినవారికి ఆరోగ్య పరిక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైద్యులు మదన్ శేఖర్ మరియు వైద్య సిబ్బంది కృష్ణారెడ్డి రాఘవయ్య విజయభారతి ప్రభావతి మహాలక్ష్మి శ్వేత ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం రూ.36 వేలుగా ఇవ్వాలి.

కోడుమూరు పల్లె వాణి:  చేనేత కార్మికులతో పాటు చేనేత రంగంలోని ఉపవృత్తులకూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం “నేతన్న భరోసా” పథకం ద్వారా సంవత్సరానికి రూ.36వేల ఆర్థిక సాయం అందించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.చేనేత సహకార సంఘాలు,సహకారేతర చేనేత రంగంలోని కార్మికుల ఉపాధికై..ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన కృష్ణాజిల్లా పెడన పట్టణంలో ప్రారంభమైన చేనేత అధ్యయన యాత్ర గురువారం కర్నూలు జిల్లా కోడుమూరుకు చేరుకుంది.చేనేత అధ్యయన యాత్రలో భాగంగా ముందుగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుగుడే మాధవస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ,సిపిఐ మండల కార్యదర్శి రాజు తదితరులతో కలిసి గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..అనంతరం పట్టణంలోని కొండపేట బీసీ కాలనీ కొత్తపేట తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులను కలుసుకొని వారి సమస్యలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు,మహిళా సంఘం నాయకురాలు సులోచనమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ..

కిరణ్ 24×7న్యూస్:   యూరియా కొరతపై రైతులకు మద్దతుగా సెప్టెంబరు నెల 09వ తేదీన రైతులతో కలిసి కర్నూలు ఆర్డీవో కి వినతిపత్రంఅందజేయనున్నట్లుగా కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు. కోడుమూరు మండల వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట అనుసారంగా రైతు విభాగం నాయకులతో ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సమావేశం ఏర్పాటు చేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వైఫల్యాలు, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్ పథకాల మోసాల గురించి , రైతులు యూరియా సంచుల కొరతపై ఆయన ఎండగట్టారు.ఈ నెల 9 వ తేదీన కర్నూలు లో జరగబోయే రైతు సమస్యలపై చేస్తున్న ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోడుమూరు నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బంగారు కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, కోడుమూరు నియోజవర్గ రైతు విభాగం అధ్యక్షులు నేతలు అభిమానులు పాల్గొన్నారు.

కోడుమూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా మల్లాపు చిరంజీవి ఎన్నిక…

గూడూరు న్యూస్ (కిరణ్)
విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సాకారంతో కోడుమూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ గా గూడూరు పట్టణానికి చెందిన మల్లాపు చిరంజీవిని ఎన్నిక అయ్యారు. ఈ మేరకు ఆయనను కోడుమూరు పట్టణంలోని సమావేశంలో టిడిపి నేతలు కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు గూడూరు పట్టణం నుండి టిడిపి యువ నేత సృజన్ కౌన్సిలర్ బుడ్డoగలి, టిడిపి నాయకులు ఇసాకు మాజీ కౌన్సిలర్ అడివప్ప మధు మరియు స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లాపూర్ చిరంజీవి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

గెలిచిన విజేతలకు బహుమతుల ప్రధానం…

కర్నూల్ న్యూస్ (కిరణ్)
ఫెన్సింగ్ క్యాడెట్ (అండర్ 17) జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీలను డాక్టర్ శంఖర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా డాక్టర్. శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఫిన్షింగ్ గేమ్ క్రీడాకారుల వ్యక్తిగత ప్రతిభ పై ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. ఈనెల 30న భీమవరం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు క్రీడాకారులు విజయం సాధించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. ఫెన్సింగ్ గేమ్ ఎంతో ప్రాచీనమైనదని రాజుల కాలం నుంచి ఉందన్నారు. భారత దేశంలో 1997లో ఫిన్షింగ్ గేమ్ అధికారికంగా గుర్తింపు పొందిదని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో జాగ్రత్తలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్. శంకర్ శర్మ తెలియజేశారు.స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్నారుల, యువత దోరణి మారిందని తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలన్నారు.ఈకార్యక్రమంలో సీసీఎస్
సీఐ. నాగశేఖర్,కర్నూలు ఫిన్షింగ్ కోచ్ మహేష్, నంద్యాల కోచ్ లక్ష్మీ నారాయణ,మణికంఠ, కాలి, సాయి తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి..

గూడూరు పల్లె వాణి( కిరణ్)
గూడూరు పట్టణంలోని పీహెచ్సీ నందు సోమవారం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల డేటా నమోదు మరియు డేటా ఎంట్రీ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు 5 సంవత్సరం లోపు వరకు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి టీకాను కచ్చితంగా వేయించాలని తెలిపారు ఈ కార్యక్రమం లో డాక్టర్ ప్రత్యుష రోషన్ టిఇసిఐటి ఇంజనీర్ ఎం పి హెచ్ ఈ ఓ రామకృష్ణయ్య డి వై హెచ్ ఓ కృష్ణారెడ్డి ఎం పి హెచ్ ఎస్ రాఘవయ్య ఏఎన్ఎం లు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా… కోడుమూరు ఎమ్మెల్యే.

గూడూరు న్యూస్ (కిరణ్)
కోడుమూరు నియోజవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటానని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తన స్వగృహం నందు శుక్రవారం గ్రీవెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు.ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు ఎమ్మెల్యే కి నేరుగా తెలియజేశారు.ప్రతి ఒక్కరి ఫిర్యాదును శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలతో నిత్యం మమేకమై, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే దస్తగిరి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు సంబంధిత అధికారులు హాజరైనారు..

బాధితులను పరామర్శించిన కోడుమూరు ఎమ్మెల్యే…

గూడూరు న్యూస్ (కిరణ్ )
కోడుమూరు నియోజకవర్గం లోని పడిదంపాడు గ్రామానికి చెందిన సువేదమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కార్యకర్తల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివశంకర్, ఉపసర్పంచ్ చంటి ఎంపిటిసి పవన్ గోవిందరాజు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్డు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం

గూడూరు న్యూస్( కిరణ్ )
గూడూరు నగర పంచాయతీ పరిధిలో గల 7 వ వార్డులో వున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి ఏడవ వార్డు కౌన్సిలర్ రత్నమ్మ వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్ళి వార్డులోని పెద్దలతో కలిసి వార్డులోగల సమస్యలు పరిష్కరించాలని ఆమె వినతి పత్రాన్ని అందజేశారు. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దస్తగిరి వారికి హామీ ఇచ్చారు. కౌన్సిలర్ వెంట నాయకులు పరశురాముడు, బాబు, కృష్ణుడు మరియు గ్రామ పెద్దలుపాల్గొన్నారు.

అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్ అందజేయాలి…

కిరణ్ 24×7న్యూస్:
అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్‌ను నిలిపివేయడంతో, రీ-అస్సేస్మెంట్ గడువును విధించింది. ఈ నేపథ్యంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండల ఎంపీడీవోకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు.ఇప్పటికే అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్ నిలిపివేయబడటంతో తీవ్ర వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని. ఇలాంటి దుర్ఘటనలు మరల జరగకుండా ప్రభుత్వం భాద్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.దివ్యాంగులకు వచ్చే ఈ పింఛన్ కారణంగానే కుటుంబసభ్యులు వారిని కనీసం పట్టించుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించాలని బీజేపీ తరపున విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర మేధావుల అధ్యక్షుల సమావేశం…

( కిరణ్ 24×7 న్యూస్ )
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర మేధావుల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మేధావుల విభాగం అధ్యక్షులు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వైసిపి పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త కోట్ల హర్షర్దన్ రెడ్డి , మరియు కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు, మేధావుల రాష్ట్ర కార్యదర్శి తిరుమలేశ్ రెడ్డి, పూజారి ధనుంజయ ఆచారి, కోడుమూరు నియోజకవర్గం మేధావులు విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు వైసిపి ఇన్చార్జి.

(కిరణ్ 24×7 న్యూస్)
కర్నూలు పట్టణం నందు జి ఆర్ సి ఫంక్షన్ హాల్ లో పెరుగు విజయవర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు కుమారుడి వివాహ కార్యక్రమానికి *మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ హాజరయ్యారు.* నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజవర్గం వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వినయ్ కుమార్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సింగల్ విండో చైర్మన్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

గూడూరు పల్లె వాణి గూడూరు పట్టణంలోని గూడూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు కేడీసీసీ బ్యాంకు నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సహకార సంఘం చైర్మన్ బొజుగు దానమన్న హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేడీసీసీ బ్యాంకు నందు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బొజుగు దానమన్న మాట్లాడుతూ స్వాతంత్ర సాధనకై ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని వారు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, సీఈఓ శివ కుమార్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

You Missed

కేడీసీసీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ని సన్మానించిన సింగనగేరి నేతలు..
కోట్ల హ‌ర్ష‌న్న‌కు గూడూరు మండల వైఎస్ఆర్సిపి నేతలు సన్మానం
కోట్ల హ‌ర్ష‌న్న‌కు గూడూరు మండల వైఎస్ఆర్సిపి నేతలు సన్మానం
కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని సన్మానించిన కోడుమూరు ఇంచార్జ్..
నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు..కోడుమూరు ఇన్చార్జి.. డాక్టర్ ఆదిమూలపు సతీష్
గూడూరు పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.. మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు.