వ్యాధుల నివారణకై ప్రజలకు అవగాహన కార్యక్రమం:
గూడూరు పల్లె వాణి:
గూడూరు వైద్య కేంద్రం పరిధిలోని పూలకుర్తి గ్రామం లో స్వస్థనారి శాసక్త్ నరిపరివార్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఇందులో భాగంగా ప్రజలకు బీపీ,షుగర్, క్యాన్సర్ లపై అవగాహన కలిగించి గర్భవతులకు,రక్త పరీక్షలు చేసి సరియైన చికిత్స చేయడం జరిగింది. 60 సంవత్సరాల పైబడినవారికి ఆరోగ్య పరిక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైద్యులు మదన్ శేఖర్ మరియు వైద్య సిబ్బంది కృష్ణారెడ్డి రాఘవయ్య విజయభారతి ప్రభావతి మహాలక్ష్మి శ్వేత ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం రూ.36 వేలుగా ఇవ్వాలి.
కోడుమూరు పల్లె వాణి: చేనేత కార్మికులతో పాటు చేనేత రంగంలోని ఉపవృత్తులకూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం “నేతన్న భరోసా” పథకం ద్వారా సంవత్సరానికి రూ.36వేల ఆర్థిక సాయం అందించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.చేనేత సహకార సంఘాలు,సహకారేతర చేనేత రంగంలోని కార్మికుల ఉపాధికై..ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన కృష్ణాజిల్లా పెడన పట్టణంలో ప్రారంభమైన చేనేత అధ్యయన యాత్ర గురువారం కర్నూలు జిల్లా కోడుమూరుకు చేరుకుంది.చేనేత అధ్యయన యాత్రలో భాగంగా ముందుగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుగుడే మాధవస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ,సిపిఐ మండల కార్యదర్శి రాజు తదితరులతో కలిసి గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..అనంతరం పట్టణంలోని కొండపేట బీసీ కాలనీ కొత్తపేట తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులను కలుసుకొని వారి సమస్యలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు,మహిళా సంఘం నాయకురాలు సులోచనమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
గెలిచిన విజేతలకు బహుమతుల ప్రధానం…
కర్నూల్ న్యూస్ (కిరణ్)
ఫెన్సింగ్ క్యాడెట్ (అండర్ 17) జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీలను డాక్టర్ శంఖర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా డాక్టర్. శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఫిన్షింగ్ గేమ్ క్రీడాకారుల వ్యక్తిగత ప్రతిభ పై ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. ఈనెల 30న భీమవరం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు క్రీడాకారులు విజయం సాధించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. ఫెన్సింగ్ గేమ్ ఎంతో ప్రాచీనమైనదని రాజుల కాలం నుంచి ఉందన్నారు. భారత దేశంలో 1997లో ఫిన్షింగ్ గేమ్ అధికారికంగా గుర్తింపు పొందిదని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో జాగ్రత్తలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్. శంకర్ శర్మ తెలియజేశారు.స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్నారుల, యువత దోరణి మారిందని తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలన్నారు.ఈకార్యక్రమంలో సీసీఎస్
సీఐ. నాగశేఖర్,కర్నూలు ఫిన్షింగ్ కోచ్ మహేష్, నంద్యాల కోచ్ లక్ష్మీ నారాయణ,మణికంఠ, కాలి, సాయి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి..
గూడూరు పల్లె వాణి( కిరణ్)
గూడూరు పట్టణంలోని పీహెచ్సీ నందు సోమవారం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల డేటా నమోదు మరియు డేటా ఎంట్రీ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు 5 సంవత్సరం లోపు వరకు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి టీకాను కచ్చితంగా వేయించాలని తెలిపారు ఈ కార్యక్రమం లో డాక్టర్ ప్రత్యుష రోషన్ టిఇసిఐటి ఇంజనీర్ ఎం పి హెచ్ ఈ ఓ రామకృష్ణయ్య డి వై హెచ్ ఓ కృష్ణారెడ్డి ఎం పి హెచ్ ఎస్ రాఘవయ్య ఏఎన్ఎం లు పాల్గొన్నారు.
మై పర్ ఫార్మసీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు..
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు పట్టణంలోని ఏ క్యాంప్ లోని మైపర్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ ఇంటర్వ్యూలలో 30 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వరించాయి.. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ మైపర్ ఫార్మసీ కళాశాలలో ఇండియన్ లాజికల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలలో 150 మంది విద్యార్థులు పాల్గొనగా 30 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వారికి కంపెనీ ఆఫర్ లెటర్ ను అందజేసినట్లుగా ఆయన తెలిపారు. మైపర్ ఫార్మసీ కళాశాలలో చదివిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని వారికి ఉద్యోగ అవకాశాలు వెంటనే అందుబాటులోకి వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసర్ల సురేష్ అకాడమిక్ డీన్ రాజ్ కుమార్ ప్లేస్మెంట్ అధికారి ప్రశాంత్ తరులు పాల్గొన్నారు.
మునగాల గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
గూడూరు పల్లెవాణి; గూడూరు మండలం మునగాల గ్రామంలో మెగా యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మత్తయ్య రాజు భైరపోగు రామ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన యువకులు
గూడూరు పల్లెవాణి( కిరణ్)
గూడూరు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని యువకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయకోవిదుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ అందరూ ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిష్ కుమారు మరియు యువకులు పెద్దలు పాల్గొన్నారు.
ఘనంగా “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్” జయంతి వేడుకలు!..
గూడూరు, పల్లెవాణి : (కిరణ్)
గూడూరు పట్టణంలో సోమవారం భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను , ప్రజాప్రతినిధులు, ప్రజలు యువకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన సేవలను కొనియాడారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలలో నే కాక ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో
నిరంజన్ బుడంగలి కౌన్సిలర్ మాధవరావు నందకిషోర్ ఇమ్మానుయేలు వినోద్ మధు లక్ష్మణ్ బాబు ప్రసాద్ నాగరాజు అశోక్ రాజు శ్రీను జార్జి రాకేష్ బుజుగు మధు చిన్నోడు కోతి జానీ విల్సన్ పాల్గొన్నారు
ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే ..
కిరణ్ 24×7 న్యూస్: కోడుమూరు నియోజకవర్గం, సి. బెలగల్ మండలం, పోలకల్ గ్రామానికి చెందిన శ్రీలత (8 వ తరగతి) చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీలత పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఆ బాలిక ఆమె తోటి విద్యార్థినిలతో కలిసి చదువుకొనుచుండగా అకస్మాత్తుగా అక్కడ ఉన్న చెట్టు కొమ్మ విరిగి వారి మీద పడింది. ఈ సంఘటనలో విద్యార్థినిలకు గాయాల అవగా, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, స్వల్ప గాయాలైన విద్యార్థులు డిశ్చార్జ్ కాగా శ్రీలత అనే విద్యార్థిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డి. విష్ణు వర్దన్ రెడ్డి , కొడుమూరు నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి , కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష తో మాట్లాడి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారితో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించారు. సోమవారం బాధిత కుటుంబీకులను పరామర్శించి ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. బాధిత కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు..
కిరణ్ 24×7 న్యూస్ :
జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గూడూరు పశు వైద్యశాల నందు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందించే కార్యక్రమాన్ని ఏడిఏ డాక్టర్ పి. శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ శివకుమార్ మాట్లాడుతూ పశు వైద్య కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆరు నెలలు వయసు దాటిన ప్రతి పశువుకు ఈ టీకాలు వేయించాలని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకిన పశువులలో పని చేసే సామర్థ్యం తగ్గుతుందని, అలాగే పాడి పశువులలో పాల ఉత్పత్తి తగ్గుతుందని అన్నారు. కావున రైతులు గాలుకుంటూ వ్యాధి సోకక మునుపే పశువులకు టీకాలు వేయించాలని అన్నారు.
బీసీ కార్పొరేషన్ దరఖాస్తుదారులు సర్టిఫికెట్లను అందజేయాలి.. కమిషనర్
కిరణ్ 24×7 న్యూస్;
గూడూరు నగర పంచాయతీకి సంబంధించిన బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందుటకు గాను 15.02.2025వ తేదీ వరకు ఆన్లైన్ నందు నమోదు చేసుకున్న సభ్యులు ఆయా వార్డుల సచివాలయం వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ కి అప్లికేషన్ అందజేయగలరని నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. దరఖాస్తుదారులు
1. ఆన్లైన్ అప్లికేషన్
2. పాస్పోర్టు ఫోటో
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
5. యూనిట్ పేరు అడ్రస్
6. ఫోన్ నెంబర్/క్యాస్ట్ సర్టిఫికెట్
జిరాక్స్ కాపీలను 25-02-2025 నుండి 28-02-2025 లోపల కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు.
బీసీ కార్పొరేషన్ రుణ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు…
కిరణ్ 24×7 న్యూస్;
గూడూరు మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందుటకు దరఖాస్తు తీసుకున్న దరఖాస్తుదారులకు సోమవారం గూడూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. గూడూరు మండలంలోని ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకు సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఇంటర్వ్యూలను నిర్వహించి వారి సర్టిఫికెట్లను పరిశీలించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శివ నాగ ప్రసాద్ మాట్లాడుతూ గూడూరు మండలంలో ఆయా గ్రామాల నుండి బీసీ కార్పొరేషన్ రుణాల కొరకు 385 దరఖాస్తులు అందినట్లుగా తెలిపారు. గూడూరు మండలంలో మొత్తం 50 బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలు నిర్వహించి వారి సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాను ప్రకటిస్తామని అన్నారు.
ఏపీ మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ..
కిరణ్ 24×7 న్యూస్; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలల్లో ఆరవ తరగతి చేరేందుకు ప్రవేశాలకు ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటనలో తెలిపినట్లుగా జూలకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దిల్షాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దిల్షాద్ మాట్లాడుతూ ఓసి, బీసీలు రూ. 150, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించనున్నట్లుగా తెలిపారు.ఏ మండలంలో పాఠశాల ఉంటే అక్కడే ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీన మెరిట్ జాబితా విడుదల చేస్తారని, ధ్రువపత్రాల పరిశీలన 30వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల కరస్పాండెంట్ ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
గూడూరులో కిషోర్ వికాసం శిక్షణ కార్యక్రమం…
కిరణ్ 24×7న్యూస్ :
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 22 వ తేదీ కిషోర్ వికాసం ఫేజ్ 2 శిక్షణ కార్యక్రమంను గూడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాగూడూరులోలయంలో. మండల అభివృద్ధి అధికారి శివ నాగ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌమార బాలికల సమస్యలు ఆరోగ్యవంతమైన అలవాట్లు, పోషణ అవసరాలు, పిల్లల సంరక్షణ ,బాలికల నైపుణ్యాలు పెంపొందించడం ,ట్రాఫికింగ్ , బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్మాస్టర్స్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్
ఏసి డిపిఓ నరసమ్మ, ఎంఈఓ సునీలమ్మ ,వెలుగు ఏపిఎం, సీసీ నరసింహులు ఐసిడిఎస్ సూపర్వైజర్ జరీనా భాను,
మండల మహిళా సమాఖ్య, గ్రామ మహిళా సమైక్య సభ్యులు ,సచివాలయంలోని మహిళా పోలీసులు ,వెల్ఫేర్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు.
సోషల్ ఆడిట్ ను నిర్వహించిన రెవిన్యూ అధికారులు. ..
కిరణ్ 24×7 న్యూస్ :కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం నందు మదాసి కురువ/మదారి కురువలకు సోషల్ ఆడిట్ ను నిర్వహించిన రెవిన్యూ అధికారులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోని సచివాలయాల నందు ఎస్సీ ఉపకులాల జాబితాను ప్రదర్శింప చేయగా గూడూరు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్నటువంటి మాల,మాదిగలు మదాసి కురువ/మదారి కురువల పైన అభ్యంతరాలు వ్యక్తం చేయగా వారి అభ్యంతరాలను నివృత్తి చేయుట కొరకు గూడూరు మండల తాసిల్దార్ ఇరువర్గాలను కూర్చోబెట్టి సోషల్ ఆడిట్ ను నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మదాసి కురువ/మదారి కురువ కులస్తులు వారి సంఘం నాయకులు మరియు వారి ఆచార వ్యవహారాలలో భాగంగా గురవయ్యల తొ పాల్గొని వారి దగ్గర ఉన్న ప్రభుత్వ జీవోలు, గజెట్లు, కోర్టు ఆర్డర్లను మండల తాసిల్దార్ కి సమర్పించడమైనది.ఈ కార్యక్రమంలో మాదాసి కురువ మదారి కురువ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి మరియు గూడూరు మండల నాయకులు టైలర్ దస్తగిరి కురువ వెంకటేశు జల్లి మధు శివ లాక వెంకటేశ్వర్లు బాలరాజు శ్రీరామ్ కుమారు ఈశ్వరయ్య టైలర్ శ్రీను సుభాష్ మద్దిలేటి భాస్కరు శంకరన్న ముంతన్న రమేషు రాజేషు కొండలయ్య హనుమంతు చిన్న దస్తగిరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి నాయకులు
కిరణ్ 24 x 7 న్యూస్:.మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సభ్యులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గూడూరు మండల తహశీల్ధార్ కే. రామాంజనేయులు కు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులజాబితాలో వున్న మదాసికురువ/మదారికురువ కులమార్పిడి రెవెన్యూ అధికారులు పాల్పడుతున్నారని అలాంటి చర్యలు జరగకుండా చూడాలని వారు కోరారు .మదాసికురువ/మదారికురువ లో కురువ అంతర్భాగం అనిమదాసికురువ/మదారికురువ సాధారణ ప్రజలు కురువ (లేదా) కురువొళ్ళు అని అంటారు అని కురువగా పిలువబడుతున్న మదాసికురువ/మదారికురువలను రెవిన్యూ అధికారులు Sc కులపత్రానికి బదులుగా ‘కురుబ’ BC-B అని మంజూరు చేస్తూ కుల మార్పిడికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కులమార్పిడి చట్టరీత్య నేరము అని .మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి సభ్యులు ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి గొర్రెల సహకార సంఘం డైరెక్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గూడూరు మండల సంఘం నాయకులు టైలర్ దస్తగిరి, వెంకటేష్, మునిష్, రంగన్న, దినేష్, రాజు, వెంకటేశ్వర్లు, శివ, లక్ష్మన్న, మిన్నెల, శ్రీరాములు, మధు, సురేష్, ఆనంద్, భీమేష్, రమేష్, మరియు యువకులు పాల్గొన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు.. గూడూరుఎస్సై
కిరణ్ల్ 24×7 న్యూస్: శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మయ్య హెచ్చరించారు. ఆదివారం గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మయ్య రాత్రి బస కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ గురించి రోడ్డు భద్రత నియమావళి గురించి చదువు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు. గ్రామాల్లో ప్రజలు ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి సోదర భావంతో కలిసి ఉండాలని సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వచ్చి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపించిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఎస్సై ప్రజలను కోరారు…
గూడూరులో వాహనాల తనిఖీ…గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమ్మయ్య గూడూరు పట్టణంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రయాణ సమయాలలో కచ్చితంగా హెల్మెట్ ను ధరించాలని లేనిపక్షంలో వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించి పోలీసు వారికి సహకరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.
శ్రీ మణికంఠ వైన్స్ షాపు ను తొలగించాలని సిఐ కి ఫిర్యాదు..
కిరణ్ 24×7 న్యూస్: గూడూరు నగర పంచాయతీలో నిర్వహిస్తున్న శ్రీ మణికంఠ వైన్ షాప్ ను తొలగించాలని వైన్ షాప్ సమీపంలో గల వ్యాపారులు కలెక్టరేట్ కార్యాలయంలోని ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశాల మేరకు మంగళవారం మద్య నియంత్రణ శాఖ సిఐ మంజుల గూడూరు పట్టణంలోని శ్రీ మణికంఠ వైన్ షాపును పరిశీలించారు. స్థానిక వ్యాపారులతో సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ వైన్ షాప్ నిర్వహణ వల్ల చుట్టుపక్కల గృహాలలో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు మరియు పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు ఇబ్బంది వాటిల్లుతుందని, తమ జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి ప్రదేశంలో శ్రీ మణికంఠ వైన్ షాప్ నిర్వహించడం మంచిది కాదని కావున వైన్ షాప్ ను ఇక్కడి నుంచి తొలగించి వేరే ప్రదేశానికి మార్చాలని కోరారు.మద్య నియంత్రణ శాఖ సీఐ మంజుల మాట్లాడుతూ సమస్యను జిల్లా కలెక్టర్ మరియు డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కు నివేదికను తెలియజేస్తానని వారి ఆదేశానుసారం తగు చర్యలు తీసుకుంటారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ అస్లాం, కౌన్సిలర్లు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు..
దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కోట్ల హర్షవర్ధన్ రెడ్డి,, డాక్టర్ ఆదిమూలపు సతీష్.
కిరణ్ 24×7 న్యూస్: కోడుమూరు పట్టణంలో హంద్రీ ఒడ్డున వెలసిన చదువుల తల్లి శ్రీ శ్రీ శ్రీ వల్లేలాంబ దేవి (సరస్వతి దేవి) దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మ వారు సరస్వతి దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అమ్మ వారికి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, మరియు కోడుమూరు నియోజవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులతో కలిసి పల్లకి సేవలో పాల్గొని అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొని వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, ప్రతాప్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, మల్లారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, లింగమూర్తి , ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కులు అందజేత … కర్నూలు జిల్లా ఎస్పీ . .
కిరణ్ 24 x 7 న్యూస్;
38 మంది హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కులు అందజేత … కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్.
• ప్రతిభ కనపరచిన విద్యార్దులను అభినందించిన … జిల్లా ఎస్పీ.
కర్నూలు బ్యూరో పల్లె వాణి న్యూస్;
కర్నూలు జిల్లాలోని హోంగార్డు కుటుంబాలలోని విద్యార్థినీ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు గురువారం తెలిపారు.
ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రతిభ కనబరిచిన 38 మంది విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులను జిల్లా ఎస్పీ గారు అందజేశారు.
ఇందులో రూ. 1,000 నుండి రూ. 2,000 ల ప్రకారం ప్రోత్సాహకరంగా జిల్లా హోంగార్డ్స్ వెల్ఫేర్ ఫండ్ నుండి మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులు అందజేశారు.
అనంతరం కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులు ఇద్దరికి అందజేశారు. ఇందులో ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు అందజేశారు.
మ్యారేజ్ గ్రాంట్ చెక్కులు 4 గురికి అందజేశారు. ఇందులో ఒక్కొక్కరి రూ. 5 వేలు అందజేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ …
టెన్త్ ,ఇంటర్ ,డిగ్రీ , మెడిసిన్ , పిజి, డిప్లమా, బి.టెక్ మొదలగు కోర్సులలో ప్రతిభ కనబరచిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ లను ఇవ్వడం జరిగిందన్నారు.
హోంగార్డుల కుటుంబాలలోని పిల్లలు బాగా చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఈ కార్యాక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ , హోంగార్డు డిఎస్పీ ఎస్ . క్రిష్ణమోహన్ , హోంగార్డు ఆర్ ఐ జావేద్ పాల్గొన్నారు.