కిరణ్24×7న్యూస్,22, జూన్.. గూడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో శనివారం విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో డయేరియా నివారణ పై తీసుకోవలసిన జాగ్రత్తలపై సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజన్ వ్యాధులు వ్యాపించకుండా సిబ్బంది తగు జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సురక్షిత నీరు ప్రజలకు అందించాలని సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందు జాగ్రత్త తెలుగు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ సమావేశంలో , ఈఓఆర్డి మదులత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సన చౌదరి, వైద్యులు  ప్రత్యూష,వి.శ్రావణి,పంచాయతి కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.