కిరణ్ 24×7న్యూస్, గూడూరు,(24, జూన్)
ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకుల సూచనల మేరకు గూడూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు ఉరుకుందు ఆధ్వర్యంలో విలేకరులు సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో 60 శాతం ఫీజు రాయితీ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు విలేకరులు శ్రీనివాస నాయుడు, దౌలత్ ఖాన్, అబ్దుల్లా, కిరణ్, ప్రభాకర్ నాయుడు, లక్ష్మన్న, గిడ్డయ్య తదితర విలేకరులు పాల్గొన్నారు..






