కిరణ్24×7న్యూస్, గూడూరు, (జూన్, 24)
రేషన్ పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ నవీన్ తెలిపారు. సోమవారం గూడూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండలంలోని రేషన్ డీలర్లతో రేషన్ పంపిణీ పై సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ నవీన్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని రేషన్ డీలర్లు రేషన్ తో పాటు ఇతరత్రా నిత్యావసర వస్తువుల పంపిణీకై సంబంధించి డీడీలు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండాలని తెలిపారు. రేషన్ గోడౌన్లకు రేషన్ తో పాటు చక్కెర ఇతరత్రా నిత్యవసర వస్తువులు పంపిణీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అందుకు రేషన్ డీలర్లంతా సిద్ధంగా ఉండాలని తెలిపారు. జూలై నెలలో కూడా గతంలో మాదిరిగానే వాహనాల ద్వారా ఇంటి వద్దకే వచ్చి కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తారని తెలిపారు. లబ్ధిదారులకు రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.