కిరణ్ 24×7 న్యూస్;
• ఆదోని , ఎమ్మిగనూరు లలో పోలీసుస్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
• రాత్రి గస్తీ పెంచాలి.
• సమర్థవంతమైన పోలీసింగ్‌తో ప్రజల్లో భద్రతా భావం పెంపొందించాలి.
• అనుమానస్పద వ్యక్తులు తారసపడితే విచారించాలి.
ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ , ఆదోని రెండవ పట్టణ పోలీసుస్టేషన్ , ఎమ్మిగనూరు అర్బన్ పోలీసుస్టేషన్ లను బుధవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆకస్మిక తనిఖీ లు చేపట్టారు. గస్తీ పోలీసులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టిచర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి పలుసూచనలు చేశారు.
రాత్రి వేళ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
విధుల్లో సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.
అనుమానస్పద వ్యక్తులు తారసపడితే విచారించాలన్నారు.
అసాంఘిక కార్యకలపాలను నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు నైట్ పెట్రోలింగ్ వ్యవస్థను పునరుద్ధరించడం జరిగిందన్నారు.
ప్రజలలో అభద్రత భావాన్ని తొలగించేందుకు గట్టి చర్యలు చేపట్టామన్నారు.
ప్రజల భద్రత కు రాత్రి గస్తీ, విజిబుల్ పోలీసింగ్ బాగా పెంచామన్నారు.
రద్దీ ప్రాంతాలలో నేరాల నివారణకు CCTV కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
నేర చరిత్ర ఆధారంగా క్రైమ్ హాట్‌స్పాట్‌లను గుర్తించాలన్నారు.
ఆ ప్రాంతాల పై పోలీసులు పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
నేర సంఘటనలను, నేరస్తులను గుర్తించడానికి రాండమైజ్డ్ పెట్రోలింగ్ రూట్‌లు, గస్తీ మార్గాలను మార్చాలన్నారు.
పోలీసుల ఉనికి గురించి నేరగాళ్ళకు తెలియకుండా రాండమైజ్డ్ గా గస్తీలు నిర్వహించాలన్నారు.
మ్యాన్ ప్యాక్ లు వినియోగించాలన్నారు.
క్రైమ్ పీక్ అవర్స్ మరియు హై రిస్క్ ఉన్న ప్రాంతాలలో డిఎస్పీలు, సిఐలు , ఎస్సై స్ధాయి పర్యవేక్షణాధికారులుగా ఉండి రాత్రి గస్తీ తనిఖీలు చేయాలన్నారు.
సమస్యలున్నచోట ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
సమర్థవంతమైన పోలీసింగ్‌తో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని పోలీసు అధికారులకు, గస్తీ పోలీసులకు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ గ సూచించారు.
జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, ఆదోని పట్టణ సిఐ శ్రీరామ్ ఉన్నారు.






