ముఖ్యమంత్రి  పర్యటనకు పటిష్ట భధ్రత.

ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన …

జిల్లా ఎస్పీ  జి. బిందుమాధవ్ ఐపియస్.

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.

కిరణ్24 x 7న్యూస్;

ఆగష్టు 31 న ( శనివారం) కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రానున్న సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్ ఐపియస్  శుక్రవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

పోలీసు బందోబస్తు, తదితర ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.

ప్రోటో కాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ  తెలిపారు.

జిల్లా ఎస్పీ  వెంట ఎయిర్ పోర్టు, ఇంటెలిజెన్స్ అధికారులు, డిఎస్పీలు జె. బాబు ప్రసాద్, కృష్ణమోహన్, శ్రీనివాస రావు, సిఐలు ప్రసాద్, చంద్రబాబు నాయుడు, ఎస్సైలు మల్లికార్జున, సునీల్ పాల్గొన్నారు.