కోడుమూరు పట్టణంలో నేడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు షూ కుదేవుల ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణ ,,తెలిపారు..సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి అధ్యక్షత వహించగా సిపిఐ మండల కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ స్ఫూర్తిని ప్రతి యువత తీసుకోవాలని ఆయన తెలిపారు .సిపిఐ సీనియర్ నాయకులు బి మునిస్వామి, సిఐటియు మండల కార్యదర్శి వీరన్న, చేనేత కార్మిక సంఘం నాయకులు లక్ష్మన్న, తదితరులు భగత్ సింగ్ దేశం కోసం చేసిన త్యాగాలను ఎన్నడూ మరవరాదని గుర్తు చేశారు.సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మధు, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు తిమ్మప్ప ,పెద్దయ్య ,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు చచిన్న, మాలి వర్కర్స్ యూనియన్ నాయకులు రైతు సంఘం నాయకులు ,పంచాయతీ కార్మిక సిబ్బందులు ,తదితరులు పాల్గొన్నారు.






