కిరణ్ 24×7 న్యూస్;
సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.
ఈ సంధర్బంగా శనివారం పదవి వీరమణ పొందిన పోలీసులను కర్నూల్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
పోలీసుశాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు.
పదవీ విరమణ పొందినవారు..
1) కర్నూలు త్రీ టౌన్ పియస్ ఎఎస్సై – టీ. దస్తగిరి సాహెబ్.
2) కౌతాళం పియస్ ఎఎస్సై – బి.సూర్యనారాయణ రెడ్డి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ … పదవీ విరమణ పొందిన సిబ్బందితో మాట్లాడుతూ…
కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీ గారిని సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, ఆర్ ఐ నారాయణ, ఎస్సై హనుమంతయ్య, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.






