కిరణ్ 24×7 న్యూస్;
లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను సెర్ప్ సీఈఓ జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అందచేశారు.
శనివారం ఓర్వకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద షేక్ సోకరాబి కి వృద్ధాప్య పెన్షన్, జలగరి రవణమ్మ కి వికలాంగ పెన్షన్, జల్ల మాధవి కి వితంతువు పెన్షన్, చెట్ల రాజు కి డప్పు కళాకారుల పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి సెర్ప్ సీఈఓ జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, పాణ్యం ఎంఎల్ఏ గౌరు చరిత అందజేశారు.
ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ వర్షాభావం వల్ల పెన్షన్ తీసుకోవడానికి రాలేని వారి కోసం 2, 3 రోజుల పాటు పెన్షన్ పంపిణీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే విషయంలో సిబ్బంది పురోగతి సాధిస్తుందన్నారు. గత నెలలో పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఈ నెల కూడా అదే స్ఫూర్తితో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మధ్యాహ్నం వరకు 90 శాతం పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.
కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ఉ.6.గంలకే ప్రారంభించడం జరిగిందన్నారు. మధ్యాహ్నం వరకు జిల్లాలో 90 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, సాయంత్రం నాటికి మిగిలిన లబ్ధిదారులకు కూడా పంపిణీ చేసి వంద శాతం పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల జిల్లాలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం రద్దు చేసి వెంటనే అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ రోజు ఓర్వకల్లు గ్రామంలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పెన్షన్ అందించి వంద శాతం పూర్తి చేసేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో 2 లక్షల 43 వేల 337 వివిధ రకాల పెన్షన్ లబ్దిదారులకు రూ.103.54 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.
పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని, అయితే ఈ నెల 1వ తేది ఆదివారం రావడం వల్ల దేశంలో ఎక్కడ లేని విధంగా 31వ తేది పూర్తి స్థాయిలో పెన్షన్ అందజేసేందుకు చర్యలు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, వాతావరణం అనుకూలించక ఓర్వకల్లు గ్రామానికి మార్చడం జరిగిందని అయినప్పటికీ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ విషయం పట్ల లబ్ధిదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లబ్ధిదారులు ఇంటి వద్దకే నేరుగా సిబ్బంది పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఇప్పటి వరకు 90 శాతం వరకు పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు.
అనంతరం ఓర్వకల్లు గ్రామంలో ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం నిర్వహిస్తున్న బాల భారతి పాఠశాలను సెర్ఫ్ సిఈఓ జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పరిశీలించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..






