గూడూరు పల్లె వాణి:
కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా *సుపరిపాలనలో తొలి అడుగు* కార్యక్రమంలో భాగంగా సోమవారంకోడుమూరు నియోజకవర్గం ముడుమల గుర్తి గ్రామం నందుటు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి వివరించారు.రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్ది, ప్రజలకు మరింత సుపరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది అని పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు కాలువలు మరియు సిసి రోడ్లు వేయాల్సిందిగా ఎమ్మెల్యే ని కోరారు ఎమ్మెల్యే స్పందించి గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో చేయలేదని దానివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని చెబుతూ మా కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా డ్రైనేజీ కాలువలు మరియు రోడ్లు అన్ని పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,వివిధ శాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






