కిరణ్ న్యూస్:
గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ ప్రెసిడెంట్ ఆర్. భాస్కర్ రెడ్డి అన్న ఆర్. మాధవ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకొని భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసుధ ప్రకాశ్ రెడ్డి. గ్రామానికి చేరుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి స్థానిక నేతలు కార్యకర్తలు కలిశారు. అనంతరం కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. కుటుంబ యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని త్వరలో అన్ని మంచి రోజులు వస్తాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాయకులు ఆర్. చంద్రారెడ్డి, మాజీ జెడ్పిసిఎల్ సుధాకర్ రెడ్డి, కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్, సంఘాల మధు, చెట్టు కింద నారాయణ, సలీం శంకర్, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట్ల అభిమానులు పాల్గొన్నారు.