ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు …

కిరణ్ 24×7 న్యూస్:

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో గస్తీతో నిఘా పట్టిష్టం చేసిన కర్నూలు తాలుకా పోలీసులు.

జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  ఆదేశాల మేరకు ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచినా, ఇసుక అక్రమంగా రవాణా చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు తాలుకా సిఐ తేజా మూర్తి తెలిపారు.

ఈ సంధర్బంగా శనివారం కర్నూలు తాలుకా పోలీసు అధికారులు , సిబ్బంది తుంగ భద్ర నది నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా గస్తీ పోలీసులను ఏర్పాటు చేశామన్నారు.

నిఘా ను పటిష్టం చేశామన్నారు. తుంగ భధ్ర నది నుండి ఇసుక అక్రమ రవాణా చేయకుండా గస్తీ పోలీసులు పరిశీలించారన్నారు.

ఇసుకను అక్రమంగా రవాణా చేయడం, ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం నేరమని, అనుమతులు లేకుండా ఇసుకను తోడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.