ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే
కిరణ్ 24×7 న్యూస్:
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కె డి సి సి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి సూచనలమేరకు కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి*

ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ అవ్వ తాతలకు,వికలాంగులకు, లబ్ధిదారులకు పెన్షన్ పంచుతూ వారి కళ్ళల్లో ఆనందం చూశారు.ఇలా ప్రతినెల పెన్షన్ పంపిణీ ఒక పండుగ వాతావరణంలో చేస్తున్న చంద్రబాబు నాయుడు కి పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ ఈ గ్రామంలో కొత్తగా 3 విడో పెన్షన్లు రావడం జరిగిందన్నారు.నియోజకవర్గం మొత్తం మీద 37 విడో పెన్షన్లు (37*4000=1,48,000) రావడం జరిగిందన్నారు.దేశం మొత్తం మీద అధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఘనత మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కి చెందుతుందని తెలియజేశారు.కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ సిఎం నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని తల్లికి వందనం,ఉచిత బస్సు ప్రయాణం,అన్నదాత సుఖీభవ,ఉచిత గ్యాస్ లు,పెన్షన్ పెంపు,మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు, ఇంక ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ గ్రామంలో స్థానికులు డ్రైనేజ్ సమస్య గురించి ఎమ్మెల్యే దస్తగిరికి విన్నవించుకోవడం జరిగింది.
వెంటనే ఆయన స్పందించి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలివ్వడమైనది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,నాయకులు,సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మరియు అధికారులు,సచివాలయం సిబ్బంది,గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







