* జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు.
* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం.
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. అవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు భారీ వాహానాలకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలో మరియు హైదరాబాద్- బెంగుళూరు, హైదరాబాద్ – చైన్నె ల నేషనల్ హైవే – 40, నేషనల్ హైవే – 44 ల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరోలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.

వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేస్తున్నారు.
వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలియజేశారు.







