భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి…
కిరణ్ 24×7 న్యూస్:
డాన్ బోస్కో సంస్థ ఆధ్వర్యంలో శికారి మహిళలకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ ట్రైనింగ్) అందించేందుకు పసుపుల గ్రామంలో డాన్ బోస్కో శికారి ప్రాజెక్ట్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శికారి మహిళలు ఆర్థికంగా మెరుగుపడడానికి ఇలాంటి స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అని తెలియజేశారు. డాన్ బోస్కో సంస్థ చేపడుతున్న ఈ శికారి ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయడం అభినందనీయమని అన్నారు.

ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తామని తెలియజేశారు. కావున శికారి ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల కు ట్యూషన్ చెప్పాలన్న ఉద్దేశ్యం కూడా చాలా మంచి పరిణామం అన్నారు.కావున శికారి ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాన్ బోస్కో సంస్థ డైరెక్టర్ సంజయ్ , సంస్థ ప్రతినిధులు, పసుపుల పంచాయతీ సెక్రటరీ హేమంత్ కుమార్ విఆర్ఓ మద్దిలేటి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, శికారి మహిళలు పాల్గొన్నారు.







