మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…
కిరణ్ 24×7 న్యూస్:
మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కర్నూలు పట్టణం స్టాంటన్ పురం లోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజవర్గంలోని వైసిపి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.