ఐక్యత యూత్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం…

కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలోని పాత బస్టాండు ఆవరణ

లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఐక్యత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా నిరుపేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యత యూత్ అధ్యక్షులు దేవ, మరియు దేవదాసు, రాజు, రమేష్, కొండన్న, మద్దిలేటి, విజయుడు, సురేంద్ర, మారెన్న,వెంకటేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.