కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలోని చైతన్య యూత్ ద్వారా దాదాపు 30 సంవత్సరాలు తమ వంతు సేవలు అందించిన రామయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. మిత్రుడు రామయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో చైతన్య యూత్ సభ్యులు మిత్రులు కలిసి వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చి అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా చైతన్ యూత్ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్నేహితులంటే సంతోషాలకు సంబంధించిన కార్యక్రమాలలోనే కాకుండా మిత్రుడి కష్టకాలంలో కూడా వారికి ధైర్యాన్ని ఇచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో ముందు ఉండడమే నిజమైన స్నేహమని తెలిపారు. చైతన్య యూత్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతి చెందిన రామయ్య ఆత్మ శాంతించాలని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు.







