తిమ్మ గురుడు స్వామి జాతర సందర్భంగా సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు…
Kiran24x7news :
గూడూరు నగర పంచాయతీలో శ్రీ శ్రీ శ్రీ తిమ్మాగురుడు స్వామి జాతర సందర్భంగా 15-4-2026 తేదీన సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు సీనియర్ విభాగం బండలాగుడు పోటీల కరపత్రాలను ఆవిష్కరించిన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసుర్య ప్రకాష్ రెడ్డి.

పోటీల్లో పాల్గొనే మొదటి బహుమతి విజేతకు 55000 వేలు,రెండో బహుమతి విజేతకు 40000 వేలు,మూడో బహుమతి విజేతకు 30000 వేలు,నాలుగో బహుమతి విజేతకు 20000 వేలు,ఐదో బహుమతి 10000 వేల రూపాయలను ఆరోవ బహుమతి విజేతకు 5000 వేల రూపాయలను అందజేయబడును.

ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభిస్తారు. పోటీలు ఉదయం 7:30 ప్రారంభం అవుతాయి. కావున నిర్ణీత సమయంలోనే ఎద్దుల యజమానులు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజి కేడీసీసీ డైరెక్టర్ రాజా రెడ్డి, కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్, మాజి నీటి సంఘం అధ్యక్షులు చెట్టు కింద మద్దిలేటి, మాజి వాల్మీకి సంఘం వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు, చెట్టు కింద నారాయణ, రేవుల గోవిందు, వి.బి కిషోర్ వర్మ , బొర్రా లింగన్న తదితరులు పాల్గొన్నారు.