గూడూరు పట్టణంలో బిజెపి పార్టీ నిరసన కార్యక్రమం…
కిరణ్ 24×7 న్యూస్ :
చారిత్రక మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్ష ఇండీ కూటమిసభ్యులు మహిళా ద్రోహులని, మహిళా బిల్లును అడ్డుకున్న రోజును చరిత్రలో చీకటి రోజుగా స్థానిక బిజెపి సీనియర్ నాయకురాలు శ్రీమతి డమాం సునీతాబాయి అభివర్ణించారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా గూడూరు పాత బస్టాండ్ కూడలిలో గల రాజ్యాంగ నిర్మాత శ్రీ భీమ్ రావు అంబేడ్కర్ మహాశయుడి విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గోరంట్ల, పట్టణ బిజెపి అధ్యక్షులు నవీన్ వేదవ్యాస్,జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి సద్దాం,ఆనంద్, వేణు,శ్రీమతి రత్నకుమారి,సాత్పుతె వీరన్న పాల్గొన్నారు.





