ఉపాధి హామీ పథకం నిధులను దోచుకుంటున్న టిడిపి నాయకులు
– వైయస్ఆర్సీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు పీఎన్ అస్లాం
కిరణ్ 24×7 న్యూస్ :

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి మయంగా మార్చి నిధులను స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు పిఎన్ అస్లాం ఆరోపించారు..

ఆదివారం గూడూరు పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి హామీ పథకాన్ని అవినీతి మాయంగా మార్చి నిధులను దుర్వినియోగం చేస్తుండటంపై ఈ నెల 27న కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి భారీ ధర్నాను చేపట్టనున్నామన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి నాయకులు

గత ఏడాది డిసెంబర్ నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు పస్తులు గడుపుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూలీలకు అందాల్సిన రూ. వెయ్యి కోట్ల వరకు నిధులను విడుదల చేయకుండా అక్రమార్కులకు పంచేందుకు చూస్తుందన్నారు.

నకిలీ మస్టరు తయారు చేసి స్థానిక నాయకులు, కార్యకర్తలకు కూలీల శ్రమను దోచిపెడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని మరచి అవినీతిపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే కూలీలకు అందాల్సిన వేతనాలు రూ. 1000 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్సిపి జిల్లా,నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలతో ధర్నాను చేపట్ట నువ్వున్నామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు భారీగా తరలివచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలని నాయకులు పిఎన్ అస్లాం కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్లు కిషోర్ ఖలీల్ నాయకులు సత్యాలు దండు శ్రీను మరియు స్థానిక వైసీపీ నాయకులు నేతలు పాల్గొన్నారు.