ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్క రించాలి…
కిరణ్ 24×7 న్యూస్ :-
వైసిపి జిల్లా పంచాయతీ రాజ్ విభాగ అధ్యక్షుడు పీ ఎన్ అస్లాం
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల కు నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం నందు వైసిపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు పీఎన్ అస్లాం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ సిరి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు అస్లాం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కూలీలకు పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే కూలీలకు ప్రతిరోజు మజ్జిగ త్రాగునీరు షామియానాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ కి వివరించారు. అదేవిధంగా ఉపాధి కూలీల నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సిరి మాట్లాడుతూ ఉపాధి కూలీల బకాయిల విషయం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అలాగే ఉపాధి కూలీలకు ప్రతిరోజు మజ్జిగ తాగునీరు షామియానాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మాజీ రెండవ వైస్ చైర్మన్ లక్ష్మన్న కర్నూలు జడ్పిటిసి ప్రసన్నకుమార్ కర్నూలు మండల వైస్ ఎంపీపీ నెహెమియా గూడూరు జడ్పిటిసి మౌలాలి మాజీ సర్పంచులు గోపాల్ సాగర్ వైకాపా నాయకులు సత్యాలు పతిరంగడు నందకిషోర్ రవి ప్రతాప్ ప్రభాకర్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.