kiran24×7news :-

బేతంచర్ల మండలంలోని ముద్దవరం గ్రామ మజారా పంచాయతీ అయిన వీరాయి పల్లె గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ మరియు సూపర్ సిక్స్ పథకాలను గ్రామ ప్రజలకు వివరిస్తూన్న డోన్ అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు.

డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలంతా సైకిల్ గుర్తుపై మీ ఓట్లు వేసి వేయించి నన్ను మరియు నంద్యాల పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి బైరెడ్డి శబరి గారిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మా ఇద్దరిని గెలిపించినచో డోన్ నియోజకవర్గ అన్ని గ్రామాలను సమాన దృష్టితో ఇంకా ఎంతో అభివృద్ధి చేయగలమని ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీ వెన్నంటే ఉండి రైతుల నిరుద్యోగ సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషించి వారి అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించగలనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొన్నారు..