ఇఫ్తార్ విందు లో పాల్గొన్న కోడుమూరు వైసిపి అభ్యర్థి మరియు కుడా చైర్మన్..
kiran24×7news :-
కర్నూల్ 39 వ వార్డు కార్పొరేటర్ సాంబశివరావు 40వ వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహరెడ్డి గార్ల ఆధ్వర్యంలో 39,40వ వార్డు ముస్లిం లకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమునకు సతీష్ గారు హాజరైనారు..ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇఫ్తార్ విందుల ద్వారా పరస్పర ప్రేమ, సోదర భావం పెంపొందిస్తాయని అన్నారు.. అలాగే అక్కడున్న ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో జెసిఎస్ కన్వీనర్ జగన్, కిరణ్ కుమార్, రాము, గిరి ప్రసాద్, మధు, అబ్దుల్లా, ఈర్షద్, నజీర్, సద్దాం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు..






