*బూడిదపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఇంటింటికి ప్రచారం*
kiran24×7news :-
గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు.ఈ సందర్భంగా బూడిదపాడు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ద్వారా అనేక లబ్ది చేకూరాయి కావున మళ్ళీ సిఎంగా జగనన్న గారిని గెలిపించాలని, దీనికి గాను రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో గూడూరు మండల నాయకులు ప్రతాప్ రెడ్డి, గూడూరు జెడ్పిటిసి మౌలాలి, పొలకల్ ప్రభాకర్ రెడ్డి, కొండారెడ్డి, ఎంపిటిసి సుబ్బన్న, దౌలత్ పాషా, గుడిపాడు లక్ష్మికాంతారెడ్డి, డీలర్ లక్షన్న, వీరన్న, మహేష్ రెడ్డి, నాగరాజు, సురేష్, సోషల్ మీడియా కన్వీనర్ మధుసూదన్, దానమయ్య, గిద్దయ్య, రవి, ఇమాన్యుల్, శామ్యూల్, సురేష్, ప్రభాకర్, యేసయ్య, సుంకన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






