kiran24x7news:-
పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని గూడూరు మండల ఎంపీడీవో జయశ్రీ సిబ్బందిని హెచ్చరించారు. గురువారం గూడూరు మండలంలోని కే.నాగలాపురం, బూడిదపాడు, పెంచికలపాడు, గుడిపాడు, మునగాల గ్రామాలలోని సచివాలయాలను ఎంపీడీవో జయశ్రీ సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి పింఛన్ల పంపిణీలో అలసత్వం వహించకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎలాంటి సమస్యలు తలెత్తనివ్వకుండా పంపిణీ నిర్వహించాలని ఆదేశించారు.
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు సచివాలయాల వద్ద లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశించారు.
పింఛన్ల పంపిణీలో సచివాలయాలకు రాలేని వృద్ధులకు, వికలాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సచివాలయం సిబ్బంది పింఛన్ అందజేయాలని తెలిపారు. కార్యాలయానికి వచ్చే పింఛన్ లబ్ధిదారులకు కార్యాలయంలోనే అందజేయాలని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ప్రకారం గురువారం సచివాలయాలలో వారి ఆదేశాను ప్రకారం పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.






