kiran24×7news :-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు తెలిపారు.

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.కర్నూలు రెండవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని కోత్తపేట, 5 రోడ్డ్ జంక్షన్, ఎస్ బి ఐ సర్కిల్, గాంధీనగర్, నరసింహరెడ్డి, లేబర్ కాలనీ, భగత్ సింగ్ , వెంకటరమణ కాలనీ లలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.కర్నూలు రెండవ పట్టణ సిఐ ఇంథియాజ్ భాషా పాల్గొన్నారు.

దేవనకొండ యుపిఎస్ పోలీసుస్టేషన్ పరిధిలోని నల్లచెలమల, కుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతంపల్లి, మాండపల్లె గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.దేవనకొండ యుపిఎస్ సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.గోనెగండ్ల పోలీసుస్టేషన్ పరిధిలోని ఎమ్ . అగ్రహారం, బైలుప్పల , గంజహళ్ళి గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.

ఎస్ ఎస్ బి అసిస్టెంట్ కమాండెంట్ రాకేష్ , గోనెగండ్ల సిఐ రామకృష్ణయ్య పాల్గొన్నారు.