kiran24×7news :  కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో రామకృష్ణ అనే రైతు గడ్డివామి శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. సమాచారం తెలిసిన వెంటనే కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలు ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు.. పక్కనే ఉన్న రైతులు గడ్డివామి మంటలను ఆర్పి వేసేందుకు శతవిధాల ప్రయత్నించారు.

దాదాపుగా గడ్డివామి మంటలకు కాలి బూడిదైంది. ప్రభుత్వం తరఫున రైతుకు పరిహారం అందించాలని బాధిత రైతు రామకృష్ణ ఆయన కుటుంబీకులు కోరుతున్నారు.