kiran24×7news :

కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని కలిసికట్టుగా గెలిపించుకుందాం– గొందిపర్ల గ్రామస్తులు..

కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం గొందిపర్ల గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ నాయకులు ఇస్మాయిల్,షకీల్,జి.రవి,దుర్గా,సోమప్ప,శ్రీను,చంద్ర, బి.మద్దిలేటీ,రాజు,కుమార్ మరియు తదితరులు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి *కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు *శ్రీ పరిగెల మురళీకృష్ణ గారికి గొందిపర్ల గ్రామస్తులు శాలువ గజమాల తో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుందామని వారు తెలిపారు.