kiran24×7news ;

గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీలోకి మాజీ ఎంపీపీ సత్య రెడ్డి, మాజీ సర్పంచ్ సుంకన్న, రామాంజనేయులు ఆధ్వర్యంలో చేరారు..

వీరికి కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త , కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

పార్టీలోకి చేరిన అనంతరం వారు మాట్లాడుతూ కోడుమూరు లో వైసిపి గెలుపు తధ్యం అని అన్నారు.. ఎంపీ గా బివై రామయ్య, ఎమ్మెల్యేగా డా.ఆదిమూలపు సతీష్ గారిని గెలిపించి జగన్ గారికి కానుకగా అందిస్తాం అని అన్నారు.. జగనన్న చేస్తున్న మంచి పనులు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు..