kiran24×7news ;
కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో లో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డా.ఆదిమూలపు సతీష్ గారిని, కర్నూలు ఎంపీ అభ్యర్థి శ్రీ బివై రామయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మొన్న జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో పేదలకు వరంగా మారిందని తెలిపారు.. గతంలో జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పూర్తిగా నెరవేర్చిన ఘనత జగన్ గారిది అన్నారు.. అలాగే ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కూడా పూర్తిగా అమలు చేసే దమ్మున్న నాయకుడు జగన్ గారని అన్నారు.. జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గడప లబ్ధి పొందిందని అన్నారు.. కుల, మతాలకు అతీతంగా అందరికీ మంచి చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు.. చంద్రబాబు చేస్తున్న కుట్రలు ప్రజలంతా గమనించాలని అవ్వ తాతలకు నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్ డబ్బులను రాకుండా కేసులు వేసి రాక్షస ఆనందం పొంది వికలాంగులు, అవ్వ తాతలను కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు..
రానున మే 13న జరిగే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ మధరావ్, మహేశ్వరరెడ్డి ,రమణారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు






