kiran24×7news ..

కర్నూలు జిల్లా….

అంతర్ రాష్ట్ర సరిహాద్దు కర్నూలు పంచలింగాల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన …. కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సిహెచ్. విజయ రావు ఐపియస్ గారు.

అక్రమ రవాణ జరగకుండా గట్టి నిఘా ఉంచాలి.

ప్రతి వాహానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు కర్నూలు – పంచలింగాల చెక్ పోస్టును కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సిహెచ్. విజయరావు ఐపియస్ గారు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు.

చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కర్నూలు రేంజ్ డిఐజి గారు పలు ఆదేశాలు జారీ చేశారు.

జాతీయ రహదారుల గుండా వెళ్ళే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అక్రమంగా తరలించే నగదు , మద్యం, ఇతర కానుకల రవాణలను అరికట్టాలన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు.

చెక్ పోస్టుల వద్ద విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని డిజిఐ గారు హెచ్చరించారు.

చెక్ పోస్టులలో పకడ్బందీగా విధులు నిర్వహించాలి. ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి.

ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెల్లని టోపిలు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందించాలని పోలీసు అధికారులకు డిఐజి గారు తెలిపారు.

కర్నూలు రేంజ్ డిఐజి గారి తో పాటు పంచలింగాల చెక్ పోస్టులో కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్, కర్నూలు తాలుకా ఎస్సై పీరయ్య , సెబ్, కమర్షియల్ ట్యాక్స్, ఆర్టిఓ సిబ్బంది ఉన్నారు.

కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయం , కర్నూలు.