kiran24x7news;
గూడూరు నగర పంచాయతీ కేంద్రంలో వైయస్సార్ సిపి సోషల్ మీడియా కన్వీనర్ అంజి గారి తండ్రి దానిమ్మ లక్ష్మన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాలేదని గుండెపోటుతో మృతి చెందాడు.
గూడూరు వైయస్సార్ సిపి నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సిపి కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు,నాయకులు డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు గూడూరుకు చేరుకొని వైఎస్ఆర్సిపి కార్యకర్త దానిమ్మ లక్ష్మన్న పార్థదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంజి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం భాష, మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కలాం భాష, కుమారు పట్టణ కన్వీనర్ ఆబెల్, శాంతులు, మద్దిలేటి, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారు.






