Kiran24x7news:
గూడూరు మండలం జూలకల్లు గ్రామ మజర గ్రామమైన పొన్నకల్లు గ్రామంలో కొండపై వెలసిన అయ్యకొండ మిన్నల స్వామి దర్గాను దర్శించుకుని మొక్కుబడి గా 101 టెంకాయలు కొట్టి మిన్నల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గూడూరు మండల టిడిపి నాయకులు నేతలు కార్యకర్తలు..
డోన్ నియోజకవర్గం అభ్యర్థి అయిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని అఖండ విజయంతో గెలిపించినందుకు మరియు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన మరియు బిజెపి అభ్యర్థులను గెలిపించినందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపి ముక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల కన్వీనర్ ఎల్. సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గుడిపాడు చంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సలీం, మరియు బిజెపి రాష్ట్ర నాయకుడు శేఖర్ రెడ్డి, పొన్నకల్లు ఎక్స్ సర్పంచ్ సుంకన్న, జూలకల్లు లక్ష్మి రెడ్డి, గోపాల వెంకటేశ్వర్లు, వెంకట రాముడు, తిమోతి ,తులసి, మండలంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.






