కిరణ్24×7న్యూస్, గూడూరు (జూన్, 24 )
డయేరియా నివారణ పై గూడూరు మండలం కే. నాగలాపురం గ్రామంలోని సచివాలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి డయేరియా నివారణ పై తీసుకోవలసిన చర్యలు మరియు సూచనలు తెలియజేశారు. అనంతరం గ్రామములోని వాటర్ స్టోరేజ్ టాంక్ ను, OHSR టాంక్ లను సందర్శించి ప్రతి రోజు క్లోరినేషన్ చేయాలని ప్రజలకు సురక్షిత నీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాలలో చదివే విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలని వైద్య సిబ్బందిని కోరారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత, జంగిల్ క్లీన్ వంటి అంశాలపై సిబ్బందికి ఎంపీడీవో వివరించారు. ఈ కార్యక్రమంలో , EORD మదులత ,AE RWS సన చౌదరి , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.






