కిరణ్ 24 x 7 న్యూస్;

38 మంది హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కులు అందజేత … కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్.

• ప్రతిభ కనపరచిన విద్యార్దులను అభినందించిన … జిల్లా ఎస్పీ.
కర్నూలు బ్యూరో పల్లె వాణి న్యూస్;
కర్నూలు జిల్లాలోని హోంగార్డు కుటుంబాలలోని విద్యార్థినీ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు గురువారం తెలిపారు.

ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రతిభ కనబరిచిన 38 మంది విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులను జిల్లా ఎస్పీ గారు అందజేశారు.

ఇందులో రూ. 1,000 నుండి రూ. 2,000 ల ప్రకారం ప్రోత్సాహకరంగా జిల్లా హోంగార్డ్స్ వెల్ఫేర్ ఫండ్ నుండి మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులు అందజేశారు.

అనంతరం కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులు ఇద్దరికి అందజేశారు. ఇందులో ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు అందజేశారు.

మ్యారేజ్ గ్రాంట్ చెక్కులు 4 గురికి అందజేశారు. ఇందులో ఒక్కొక్కరి రూ. 5 వేలు అందజేశారు.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ …

టెన్త్ ,ఇంటర్ ,డిగ్రీ , మెడిసిన్ , పిజి, డిప్లమా, బి.టెక్ మొదలగు కోర్సులలో ప్రతిభ కనబరచిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ లను ఇవ్వడం జరిగిందన్నారు.

హోంగార్డుల కుటుంబాలలోని పిల్లలు బాగా చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యాక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ , హోంగార్డు డిఎస్పీ ఎస్ . క్రిష్ణమోహన్ , హోంగార్డు ఆర్ ఐ జావేద్ పాల్గొన్నారు.