Kiran24x7news:కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి వైసిపి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని వైసీపీ పార్టీ నాయకులు సంధ్య విక్రమ్ కుమార్ తెలిపారు. గురువారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన మహేష్ కుటుంబీకులు అనారోగ్యంతో కర్నూలు జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండడంతో సమాచారం తెలిసిన వెంటనే నాయకులు సంధ్య విక్రమ్ కుమార్ హాస్పిటల్ చేరుకొని బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైసీపీ పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే తన వంతుగా సహకారం అందించి వారికి అండగా నిల్చున్నానని తెలిపారు. గ్రామ గ్రామంలో పర్యటించి వైసిపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అభివృద్ధి జరగడం సాధ్యం కాదని ప్రజలే వైసిపి పార్టీకి మరల పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముందడుగు వేస్తారని తెలిపారు. జగనన్న అండగా ఉండి ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తారని రాబోవు రోజుల్లో వైసిపి పార్టీకి ప్రజలు ఘన విజయం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు అభిమానులు పాల్గొన్నారు.