గూడూరు న్యూస్ (కిరణ్)
కోడుమూరు నియోజవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటానని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తన స్వగృహం నందు శుక్రవారం గ్రీవెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు.ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు ఎమ్మెల్యే కి నేరుగా తెలియజేశారు.ప్రతి ఒక్కరి ఫిర్యాదును శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలతో నిత్యం మమేకమై, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే దస్తగిరి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు సంబంధిత అధికారులు హాజరైనారు..