కిరణ్ 24×7న్యూస్:   యూరియా కొరతపై రైతులకు మద్దతుగా సెప్టెంబరు నెల 09వ తేదీన రైతులతో కలిసి కర్నూలు ఆర్డీవో కి వినతిపత్రంఅందజేయనున్నట్లుగా కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు. కోడుమూరు మండల వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట అనుసారంగా రైతు విభాగం నాయకులతో ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సమావేశం ఏర్పాటు చేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వైఫల్యాలు, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్ పథకాల మోసాల గురించి , రైతులు యూరియా సంచుల కొరతపై ఆయన ఎండగట్టారు.ఈ నెల 9 వ తేదీన కర్నూలు లో జరగబోయే రైతు సమస్యలపై చేస్తున్న ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోడుమూరు నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బంగారు కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, కోడుమూరు నియోజవర్గ రైతు విభాగం అధ్యక్షులు నేతలు అభిమానులు పాల్గొన్నారు.